/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
Indian Railways
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే(irctc) బిగ్ షాకిచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రయాణానికి కొద్ది గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఇకపై నయా పైసా కూడా తిరిగి రాదని స్పష్టం చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం, మీ కన్ఫర్మ్ టికెట్‌ను రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే క్యాన్సిల్ చేసుకుంటే, కనీస ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తం రీఫండ్ వస్తుంది. ఒకవేళ 72 గంటల నుండి 24 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే, టికెట్ ధరలో 25 శాతం కట్ చేసుకుని మిగిలిన డబ్బులు ఇస్తారు(Ticket Refund Rules). అంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు నుండి ఒకరోజు ముందు వరకు ఈ రూల్ వర్తిస్తుందన్న మాట.
Also Read : మావోయిస్టు పార్టీకి మరో షాక్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు ?
8 గంటల కంటే తక్కువ సమయం
ఇక ప్రయాణానికి 24 గంటల నుండి 8 గంటల ముందు గనుక టికెట్ రద్దు చేస్తే, సగం డబ్బులు అంటే 50 శాతం కోత విధిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ క్యాన్సిల్ చేస్తే అసలు రీఫండ్ రాదు. అంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదన్నమాట. కౌంటర్ టికెట్లకు, ఆన్‌లైన్ ఇ-టికెట్లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి.
మరోవైపు టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో కూడా రైల్వే శాఖ(indian-railway) కొన్ని కీలక మార్పులు చేసింది. అక్రమ బుకింగ్‌లను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన రూల్ ప్రకారం, జనరల్ కోటాలో బుకింగ్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. తత్కాల్ టికెట్ల విషయంలో కూడా ఇదే నిబంధన ఉంది.
Also Read : దేశ రాజకీయాల్లో సంచలనం: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు? కేంద్రం మాస్టర్ ప్లాన్!
Follow Us