/rtv/media/media_files/2025/03/24/Cnu5EID1LmTzVE9UYesr.jpg)
Toll Plaza
National Highway FASTag Update : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ ప్లాజా సిబ్బంది బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు(శనివారం) నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు.ముందుగా చెప్పినట్లే నగదు లావాదేవీలు నిలిపివేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండటం ఇప్పుడు తప్పనిసరి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోతే మాత్రమే . యూపీఐ (UPI) ద్వారా చెల్లించే అవకాశం మాత్రమే ఉంది. అయితే ఒక వేళ తప్పనిసరి అయి యూపీఐ ద్వారా చెల్లించాల్సి వస్తే మాత్రం సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
అంటే, నగదు రూపంలో లేదా సాధారణ డిజిటల్ పద్ధతిలో గానీ తక్కువ ధరకే వెళ్లడం ఇక మీదట సాధ్యం కాదని గుర్తించాలి. అంతేకాదు నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారు. నిబంధనలు అతిక్రమించి, టోల్ గేట్ వద్ద నగదు చెల్లిస్తామని మొండికేస్తే, హైవే మీదకు వాహనాన్ని అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. టోల్ చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తే సదరు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఆన్‌లైన్ ద్వారా జరిమానాలు విధించడంతో పాటు, నేరుగా నోటీసులు పంపేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
అందుకే ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే వాహనదారులు ముందుగానే తమ ఫాస్టాగ్ వాలెట్‌ను రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి, హైవే ప్రయాణానికి రెడీ అయ్యే ముందు మీ ఫాస్టాగ్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి! తగినంత బ్యాలెన్స్ ఉందా లేదా తప్పకుండా చూసుకోండి.
Follow Us