/rtv/media/media_files/2025/02/16/AgkYspqGGxLkfupFF2Cw.jpg)
New Chief Minister of Delhi Likely To Be Picked Tomorrow
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాకా సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 17న (సోమవారం) బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ సీఎం బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చలు జరిపి అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ సీఎం ఎవరనేది లీక్ కాకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకూడదని బీజేపీ హైకమాండ్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పర్వేష్ వర్మతో పాటు ఢిల్లీ మజీ విపక్ష నేత విజేంద్ర గుప్తా, అలాగా ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ, ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్ తదితరుల పేర్లు కూడా సీఎం రేసులో ఉన్నాయి. ఇక సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని బీజేపీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి.
Also Read: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!
ఇదిలాఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి అధికారం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమై పరాజయం పొందింది. కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. సీఎ అతిషి మాత్రం కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు.
Also Read: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. వెలుగులోకి సంచలన విషయాలు
Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!