/rtv/media/media_files/2025/02/17/BwR34SF4C4mtd2cHn7fl.jpg)
RFF Constable Carrying Her Child
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫాం మారినట్లు అకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఆ రైలు వద్దకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో ఇది తొక్కిసలాటకు కారణమైంది. ఈ విషాద ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. భద్రత బలగాలను కట్టుదిట్టం చేసింది.
అయితే ఈ గందరహగోళం నడుమ ఓ ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది. రీనా అనే కానిస్టేబుల్.. ఆ రైల్వే స్టేషన్‌లో తన బిడ్డను ఎత్తుకొనే డ్యూటీ చేశారు. ఆమె అలా తన బిడ్డను ఎత్తుకొని, చేతిలో కర్ర పట్టుకొని ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరలవుతున్నాయి. దీనిపై నెటిజనన్లు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది రీనా అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు.
Motherhood and Duty.
— Sunaina Bhola (@sunaina_bhola) February 17, 2025
Some Picture dont need words to explain.
More power to this lady RPF Constable.
Salute to her Dedication to service.#JaiHind #IndianRailways #viralvideo #earthquake #Chhaava #TejRan #Delhi #MahaKumbh2025 #Sreeleela #stockmarket pic.twitter.com/YJA4fpbj9m
ఇదిలాఉండగా.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైళ్ల పేర్లు రెండూ ఒకేలా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్లాట్‌ఫామ్ 14పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఉంది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్ 12వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది.