/rtv/media/media_files/2025/03/04/wRtsd3QdS96bQN3hDZfE.jpg)
మహారాష్ట్ర (Maharashtra) లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్ట్ కావడంతో మంత్రి ధనంజయ ముండే (Dhananjay Munde) రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు.
Also Read : చైనా పై ట్రంప్ డబుల్ షాక్..వాటిని పెంచేసిన అగ్రరాజ్యం!
#WATCH | Maharashtra CM Devendra Fadnavis says, "Maharashtra Minister Dhananjay Munde has tendered his resignation today. I have accepted the resignation and sent it to the Governor for further course of action." https://t.co/S8YYzZxr7D pic.twitter.com/DpxcIUWsrZ
— ANI (@ANI) March 4, 2025
Also Read : బంగ్లాదేశ్ యూటర్న్..భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన
రెండు గంటల పాటు సుదీర్ఘంగా
కాగా నిన్న రాత్రి ఎన్సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్, ముండేతో సీఎంతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. కేసు తేలే వరకు పదవి నుంచి తప్పుకోవాలని సీఎం సూచించగా ఆయన రిజైన్ చేశారు. ముండే రాజీనామాను తాను ఆమోదించానని, దానిని గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు పంపానని ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. ధనంజయ ముండే ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు.
Also Read : తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు!
రాజకీయం చేయవద్దు.. సీఎం ప్రకటన
సర్పంచ్ హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృఢ సంకల్పంతో దర్యాప్తు చేస్తోందని, నిందితులు ఎవరైనా, ఏ పదవిలో ఉన్న తప్పించుకోలేరని గతంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్హామీ ఇచ్చారు. ఈ హత్య కేసును రాజకీయం చేయవద్దని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలను కోరారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు.
Also Read : డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి..