మావోయిస్టులు ఓ మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్‌కు చెందిన లాడెడ్ గ్రామస్థురాలు యాలం సుక్రా(40) అనే మహిళను, తన భర్తను శనివారం అర్థరాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్పారు. వారిద్దరినీ సమీపంలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత మహిళ గొంతు కోసి హత్య చేశారని, అలాగే ఆమె భర్తపై కూడా కర్రలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం 2017 నుంచి సుక్రా.. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారని అందుకే ఆమెను హతమార్చామని మావోయిస్టులు ఘటన స్థలంలో రాసిపెట్టిన లేఖను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. బీజాపూర్‌లో బస్తర్ డివిజన్‌లో ఈ ఏడాది మావోయిస్టుల దాడుల వల్ల 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల్లోనే నలుగురిని హత్య చేశారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు! అయితే ఇటీవల బీజాపూర్‌లోని బాసగూడ ప్రాంతంలో ఓ అంగన్వాడీ కార్యకర్తను, ఇద్దరు మాజీ సర్పంచ్‌లను పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ వాళ్లను మావోయిస్టులు హత్య చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ బేస్ క్యాంప్‌పై రాకెట్ లాంటర్లతో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ మధ్య కాలంలో పోలీసు బలగాలు, మావోయిస్టుల వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. Also Read: ముక్కలయ్యేందుకు సిద్ధంగా కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు Also Read: కీలక దశకు సిరియా అంతర్యుద్దం.. రష్యాకు పారిపోయిన అసద్!