/rtv/media/media_files/2025/03/27/k008WiSKulHNGglTQYWM.jpg)
Nandini Milk
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నందిని పాలు, పెరుగు ధరలను లీటరుకు రూ.4 పెంచింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు, పాల ఉత్పత్తి ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పశు సంవర్ధకశాఖ మంత్రి కె.వెంకటేష్ అన్నారు. ధరల పెంపు వల్ల రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
పెరిగిన నందిని పాల ఉత్పత్తుల ధరలు ఇవే
1.టోన్డ్ మిల్క్: లీటరుకు రూ.42 నుంచి రూ.46కి పెంపు
2.హోమోజెనైజ్డ్ టోన్డ్ మిల్క్: లీటరుకు రూ.43 నుంచి రూ.47కి పెంపు
3.ఆవు పాలు : లీటరుకు రూ.46 నుంచి రూ.50కి పెంపు
4.శుభ్ మిల్క్: లీటరుకు రూ.48 నుంచి రూ.52కి పెంపు
5.పెరుగు: లీటరుకు రూ.50 నుంచి రూ.54కి పెంపు
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో పాల ధరలు లీటరకు రూ.4 చొప్పున పెరుగుతాయని కర్ణాటక సహకార మంత్రి కె.ఎన్ రాజన్న వెల్లడించారు. పాల సంఘాలు, రైతుల కోసమే ధరలు పెంచినట్లు ఆయన తెలిపారు. పాల సంఘాల వాళ్లు లీటరుకు రూ.5 పెంచాలని డిమాండ్ చేస్తున్నారని.. ప్రభుత్వం దీనికి అంగీకరించి ఏప్రిల్ 1 నుండి రూ.4 పెంచాలని నిర్ణయించిందని చెప్పారు. బస్సు, మెట్రో ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పాల ధరలు పెంచినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తన పాల ఉత్పత్తులను 'నందిని' బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
karnataka | milk-products | national-news