Lifetime Pani Puri: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఓ పానీపూరీ షాప్ యజమాని వినూత్న ఆఫర్స్ ప్రకటించాడు. రూ.99వేలు చెల్లిస్తే జీవిత కాలం పానీపూరీ తినొచ్చన్నాడు. ఇంకా ఒకేసారి 151 తింటే రూ.21వేల నగదు బహుమతి పొందొచ్చన్నాడు. ఒకేసారి 40 తినగలిగితే రూ.1 మాత్రమే చెల్లించాలి అని తెలిపాడు.

New Update
LIFE TIME PANI PURI OFFER

LIFE TIME PANI PURI OFFER Nagpur

నోరూరించే పానీ పూరీ అంటే అందరికీ ఇష్టమే. రోజు తిన్నా విసుగు అనిపించదు. అలాంటి వారికోసం ఓ పానీ పూరీ షాప్ యజమాని విజయ్ మేవాలాల్ గుప్తా వినూత్న ఆఫర్ ప్రకటించాడు. లైఫ్ టైం అన్ లిమిటెడ్ పానీ పూరీ ఆఫర్ తీసుకొచ్చాడు. అది మాత్రమే కాకుండా మరికొన్ని ఆఫర్లు సైతం అందిస్తున్నాడు. అతడు నిర్దేశించిన పానీ పూరీలు తింటే రూ.వేలల్లో డబ్బులు పొందొచ్చని తెలిపాడు. దీంతో అతడి పానీ పూరీ ఆఫర్స్ నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

రూ.21,000 నగదు బహుమతి

ఈ ఆఫర్ మరెక్కడో కాదు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో. అవును మీరు విన్నది నిజమే. విజయ్ మేవాలాల్ గుప్తా కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఈ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.99,000 లు చెల్లిస్తే చాలు లైఫ్‌ టైం పానీ పూరీ తినే ఆఫర్ తీసుకొచ్చాడు. ఇది మాత్రమే కాదు.. ఒకేసారి 151 పానీ పూరీలను తినగలిగిన ఎవరికైనా దాదాపు రూ.21,000 నగదు బహుమతిని కూడా అందిస్తున్నాడు. అది సరిపోకపోతే, మీరు ఒకేసారి 40 పానీపూరీలను తినగలిగితే రూ. 1 మాత్రమే చెల్లించాలి. ఈ ఆఫర్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

అయితే లైఫ్ టైం పానీపూరీ ఆఫర్‌ను ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు సొంతం చేసుకున్నట్లు షాప్ యజమాని తెలిపాడు. అతడు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే రూ. 99,000 జీవితకాల ఆఫర్‌ను తీసుకున్నారు. మా దగ్గర ఒకే రోజు నుండి జీవితకాల ప్లాన్‌ల వరకు ఆఫర్‌లు ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు నన్ను ఎంతగానో పాపులర్ చేశాయి. అదే సమయంలో మరిన్ని కస్టమర్లను తీసుకువచ్చాయి’’ అని పేర్కొన్నాడు. 

Also Read :  USA:  ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

అలాగే అతడు మాట్లాడుతూ.. “మా దగ్గర రూ.1 నుండి రూ. 99,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు మా దగ్గర ఆఫర్లు ఉన్నాయి. రూ. 1 ఆఫర్‌ను మహా కుంభ్ ఆఫర్ అంటారు. ఈ ఆఫర్‌లో ఒక కస్టమర్ 40 పానీపూరీలు తింటే వారు మాకు రూ. 1 మాత్రమే చెల్లిస్తారు,” అని అతను చెప్పాడు. ఇంకా “మా దగ్గర లాడ్లీ బెహన్ యోజన ఆఫర్ కూడా ఉంది. ఇందులో కస్టమర్లు రూ.60కి అపరిమిత పానీపూరీలను పొందుతారు.” అని చెప్పుకొచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు