/rtv/media/media_files/2025/02/28/gefCMOq5RV3G1LnADb1k.jpg)
Mumbai Lalbaug area Massive fire breaks
ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని ఒక ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 42వ అంతస్తులో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డులో సాలెట్ 27 అనే రెండు భవనాలు ఉన్నాయి. అందులోని ఒకదానిలో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
mumbai fire breaks
తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోల ప్రకారం.. సాల్సెట్ అనే ఎత్తైన భవనం లోపల నుండి దట్టమైన నల్లటి పొగ, మంటలు బయటకు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
Fire at @Byculla #mumbai #salsette27 building #Mumbai #fire@abpmajhatv @aajtak @mumbaitak @MumbaiPolice @mybmc @zee24taasnews @MumbaiLocal_ @lokmat pic.twitter.com/9yEAMp5UCq
— Sameer Joshi (@ijoshisameer) February 28, 2025
అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఓ అధికారి మాట్లాడుతూ.. తమకు సమాచారం అందగానే.. బెస్ట్, పోలీసులు, అంబులెన్స్ సర్వీస్, ఇతర ఏజెన్సీల బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
Massive fire at Salsette 27 highrise in South #Mumbai
— Nabila Jamal (@nabilajamal_) February 28, 2025
Blaze erupted on 42nd floor of the Byculla tower around 10.45 AM. Thick black smoke billowed from the glass facade, visible from afar. Fire tenders, police and ambulances at the spot. Cause unknown.#MumbaiFire #Salsette27 pic.twitter.com/dN3jcmAmDw
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ‘‘శుక్రవారం ఉదయం, బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డులోని న్యూ గ్రేడ్ ఇన్‌స్టా మిల్లు సమీపంలో ఉన్న సాల్సెట్ 27వ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉదయం 10:45 గంటలకు జరిగింది.
ముంబై అగ్నిమాపక సిబ్బంది ఉదయం 10:42 గంటలకు లెవల్-1 (మైనర్) అగ్నిమాపక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అయితే 57 అంతస్తుల నివాస భవనంలోని 42వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని మున్సిపల్ సంస్థ తెలిపింది.