Monalisa: బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్.. కాసేపట్లో పెళ్లి

కుంభమేళా వైరల్ యువతి మోనాలిసా తాజాగా చిక్కుల్లో పడింది. కేరళలోని తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. వాళ్లిద్దరి ప్రేమను మోనాలిసా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమకు రక్షణ కావాలని కోరారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

New Update
Monalisa, viral Maha Kumbh girl, seeks police protection in Kerala with boyfriend

Monalisa, viral Maha Kumbh girl, seeks police protection in Kerala with boyfriend

గతేడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళలో అక్కడ పూసలు అమ్ముకున్న మోనాలిసా భోస్లే అనే యువతి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమె చిక్కుల్లో పడింది. కేరళలోని తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. వాళ్లిద్దరి ప్రేమను మోనాలిసా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమకు రక్షణ కావాలని కోరారు. మరికాసేపట్లో ఓ గుడిలో వీళ్లకు పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం !

ఇక వివరాల్లోకి వెళ్తే.. మోనాలిసా ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం కేరళకు వచ్చింది. ఆమె ఎర్నాకులంలో ఉండగా.. తనకు, తన తండ్రికి వివాదాలు తలెత్తాయి. దీంతో మోనాలిసా తన ప్రియుడు ఫర్మన్ ఖాన్‌తో కలిసి ట్రైన్‌లో తిరువనంతపురం వెళ్లింది. అక్కడికి వెళ్లాక వీళ్లద్దరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఫర్మాన్‌ ఖాన్‌ను ప్రేమించడం తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని వాళ్ల నుంచి తమకు రక్షణ కావాలని ఫిర్యాదు చేసింది. 

Also Read: యుద్ధకాలం..గ్యాస్ కొరత..ఇలా చేస్తే  మీ వంట గ్యాస్‌ బోలెడంత ఆదా..!

మహారాష్ట్రకు చెందిన ఫర్మన్ ఖాన్‌తో తనకు ఏడాదిన్నర కాలంగా సంబంధం ఉన్నట్లు మోనాలిసా పోలీసులకు తెలిపింది. కానీ తన కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించడం లేదని తనకు వేరే అబ్బాయితో పెళ్లి ఏర్పాట్లు చేశారని పేర్కొంది. తాను ఫర్మన్‌ ఖాన్‌తోనే జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. మధ్యప్రదేశ్‌లో గాని, మహారాష్ట్రలో గాని తమకు రక్షణ లేదని.. అందుకే కేరళ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.

అనంతరం సినిమా షూటింగ్ టీమ్ సభ్యులు కూడా ఆ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. వాళ్లతో కలిసి మోనాలిసా, తన ప్రియుడు వెళ్లిపోయారు.  ఆ తర్వాత తిరువనంతపురంలోనే ఆరుమనూర్‌ ఆలయానికి చేరుకున్నారు. ఈరోజే ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.  కేరళ జనరల్ విద్యాశాఖ మంత్రి, సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎంవీ గోవిందన్, ఎంపీ ఏఏ రహిమ్ కూడా కూడా ఆ గుడికి చేరుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు