జమిలి ఎన్నికల బిల్లు.. స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిఘటించాలంటూ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

New Update
Stalin

వన్ నేష్-వన్ ఎలక్షన్‌ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టడమే ఆలస్యం. ఆ వారమే జమిలి ఎన్నికల బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెటనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లును కొన్ని పార్టీలు సమర్థిస్తుంటే కాంగ్రెస్‌తో సహా మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: వామ్మో.. చెస్‌ ఛాంపియన్‌ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !

జమిలి ఎన్నికలు భారత సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు.ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం క్రూరమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని ప్రజలందరూ ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.    

Also Read: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్

'' జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఈ నిర్ణయం దేశంలో ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేసేలా ఉంది. మనమందరమూ దీన్ని ప్రతిఘటించాలి'' అంటూ స్టాలిన్‌ పేర్కొన్నారు.  ఇదిలాఉండగా.. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ మీటింగ్‌లో జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. మరోవైపు డిసెంబర్ 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాయి. 

Also Read: కేంద్రం స్పందించేవరకూ ఆగండి..ప్రార్థనా స్థలాల కేసులో సుప్రీంకోర్టు

Also Read: వీసా లేకున్నా ఆ దేశంలో 60 రోజులు ఉండొచ్చు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన ఘనట బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం వంట చేస్తూ తల్లి బయటకు వెళ్లింది. అదే సమయంలో మంటలు సిలిండర్‌కు అంటుకొని ప్రమాదం జరిగింది. కలెక్టర్ కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

New Update
bihar fire accident

bihar fire accident

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన దుర్ఘటన బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం తల్లి ఇంట్లో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లా బరియార్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌మని గ్రామంలో మహిళ ఇంట్లో వంట చేస్తూ మిగతా వంటపాత్రలు కడిగేందుకు బయటికి వెళ్లింది. తల్లి బయటకు వెళ్లికా స్టవ్‌ మంటలు సిలిండర్‌కు అంటుకుని పేలుడు సంభవించింది. దాంతో ఇంట్లో ఉన్న నలుగురు చిన్నారులు బ్యూటీ కుమారి, విపుల్‌ కుమార్‌, సృష్టి కుమారి, హన్సిక కుమారి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. 

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఇంట్లో వంట చేస్తూ తల్లి బయటికి వెళ్లిన సమయంలో గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకొని పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం 16 లక్షలు అందజేయనున్నట్లు ముజఫర్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృ‌తితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబసభ్యులు, బందువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు