Miss Universe India : మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ! జైపూర్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్‌కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.ఆమెకు 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా క్రౌన్‌ను అందజేశారు. By Bhavana 23 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 11:59 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rhea Singha : ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్ ముద్దుగుమ్మ రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ లో తలపడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచింది. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్నిఆమెకు బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రియా సింఘా చాలా సంతోషంగా ఉన్నారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. నేను ఈ కిరీటానికి అర్హురాలిని అని భావిస్తున్నా. గత విజేతలే నాకు స్ఫూర్తి’ అని రియా చెప్పారు. రియా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా దంపతుల కుమార్తె. రియా ప్రస్తుతం టాప్ మోడల్ గా రాణిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రియా ఇన్‌స్టాలో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024కు ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ భారత్‌కు వస్తుందని ముందుగానే ఊర్వశి ఆశాభావం వ్యక్తం చేశారు. Also Read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... వారందరికీ పింఛన్లు కట్! #gujarat #rajasthan #jaipur #miss-universe-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి