/rtv/media/media_files/2025/03/21/UO2CNmBCdWyRcRjx91Nk.jpg)
fire erupts at chemical factory in Dhulagarh, Howrah
chemical factory in Dhulagarh
హౌరాలోని ధూలాఘర్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంక్రైల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూలాఘర్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలముకుంది. పొగలు రావడంతో కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
15 ఫైర్ ఇంజన్లు
దీంతో మొదట 5 నుంచి 6 ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలు ప్రయత్నించినా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పలేకపోయింది. దీంతో రాత్రి 7:30 గంటలకు దాదాపు 15 ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటలను అదుపుచేయలేకపోయినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యాక్టరీ లోపల ఎవరూ చిక్కుకోలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందనే దానిపై స్థానికులు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్లాస్టిక్ సంచులతో సహా వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తుందని అంటున్నారు. మండే గుణం ఉన్న పదార్థాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, 3 కిలోమీటర్ల దూరం నుండి నల్లటి పొగ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
కాగా ఈ ఫ్యాక్టరీలో 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఫ్యాక్టరీ వర్క్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. అయితే ఫ్యాక్టరీలో మంటలను గమనించిన వెంటనే దగ్గర్లో ఉన్న కార్మికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.