Massive explosion : తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా, కందీలి సమీపంలోని విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్ పల్లి  గ్రామంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
FotoJet (93)

Massive explosion

Massive explosion : తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా, కందీలి సమీపంలోని విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్ పల్లి  గ్రామంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్ధంతో పదికిలోమీటర్ల మేర భూమి కంపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రసాయనాలను మిక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల వరుస పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని సుమారు 10కి పైగా గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరణించిన వారిలో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన గోదాములో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆ భవనం పూర్తిగా నేలమట్టమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయని సమాచారం. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు