/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
Maoists encounter Photograph: (Maoists encounter )
ఛత్తీష్‌గడ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం కెర్లపాల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. జిల్లా రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ శుక్రవారం నుంచి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సల్స్ కాల్పులకు భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
Also read: Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
మార్చి 28 నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నారాయణ జిల్లాలో మావోయిస్టులు అమర్చి IED బాంబు పేలి శుక్రవారం ఓ జవాన్ గాయపడ్డాడు. జిల్లా హాస్పిటల్‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. గోగుండ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గడిచిన మూడు నెలల్లోనే వందల మంది మావోయిస్టులను వివిధ ఆపరేషన్లు నిర్వహించి భద్రతా దళాలు మట్టుబెట్టాయి.