టార్గెట్ పోలీస్.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఏం చేశారంటే? ఛత్తీస్‌గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. By Vijaya Nimma 29 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర అమర్చారు. ఒక్కసారిగా మందుపాతర పేలడంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఐఈడీలను ముందుగానే గుర్తించి తీసేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వైరును కదిలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ ఆస్పత్రికి తరలింపు.. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత గాయపడిన జవాన్లను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు. గత జులైలో కూడా బస్తర్ ప్రాంతంలో ఇలాగే ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. Also Read: ఐఫా అవార్డ్స్ లో 'యానిమల్' హవా.. ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు #maoist #crime #chattisgarh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి