/rtv/media/media_files/2025/02/23/iW0Nhb36oelRLw06YZte.jpg)
Narendra Modi -Kailash
Teacher Kailash : గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారంటూ కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి కొలామి భాషలో కైలాష్ పాటను కంపోజ్ చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నిమ్మకాయ నీరు తాగితే?
ఏఐ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాంకేతికతను వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. ఇస్రో 100 వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికే గర్వకారణమని ప్రధాని కొనియాడారు. అంతరిక్షశాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే దేశ బలమైన సంకాల్పానికి ఇది నిదర్శనమన్నారు. గత పదేళ్లలో సుమారు 460 ఉపగ్రహాలను లాంచ్ చేసినట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రతి సంవత్సరం పురోగతి సాధిస్తున్నామన్నారు. చంద్రయాన్ విజయం దేవానికి ఎంతో గర్వకారణం అన్నారు. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపెడుతున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!
ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడమనేది ఇటీవల సాధించిన విజయాల్లో ఒకటన్నారు. ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనడానికి పారిస్‌కు వెళ్లాను. కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. తాజాగా తెలంగాణ ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని మోడీ అన్నారు. అంతరిక్షం లేదా ఏఐ అయినా భాగస్వామ్యం పెరుగుతున్నదని తెలిపారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపడానికి ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకితం చేస్తామన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం, రాజ్యాంగం రూపకల్పనలో మహిళ పాత్ర గురించి ఆయన కొనియాడారు.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఎవరీ కైలాష్..?
తొడసం కైలాస్ తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత ఇంద్రవెల్లి మండలం, గౌరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.తోడసం కైలాస్ 2017 నుంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోండీ భాషను ప్రచారం చేస్తున్నాడు. యువతకు ప్రేరణ కలిగించే సందేశాలను గోండీలో సద్విచార్ పుస్తకాన్ని రచించి వాటిని యూట్యూబ్ చానెల్ లో విడుదల చేసి యావత్ ఆదివాసీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గోండీ భాషలో రచించిన పుస్తకాలు, కవితలు, కథలు, స్ఫూర్తిదాయక సందేశాలను ఏఐ(కృత్రిమ మేధ) ద్వారా చదివిస్తున్నాడు. వాటిని రికార్డు చేసి యూట్యూబ్ లో పొందుపరుస్తున్నాడు. గోండీ భాషకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో కైలాష్ ముందుకొచ్చాడు. గోండీ భాషపైన లోతుగా అధ్యయనం చేసి, వాడుకలో లేని కొన్ని పదాలు, పూర్వీకులు ఉపయోగించిన భాష పదాలను సేకరించాడు. వాటిని స్వచ్ఛమైన గోండీ భాషలో రాసి పుస్తకాన్ని రాశాడు. రాసిన వాటిన్నింటిని గూగుల్ డాక్యూమెంట్, బ్లాగ్ లో భద్రపరుస్తున్నాడు . తాజాగా గోండీ భాషలో మాట్లాడే విధానాన్ని యూట్యూబ్ ద్వారా వివరిస్తున్నాడు. కాండిరంగ్ వేసుడింగ్(పిల్లల ప్రపంచం) పుస్తకాన్ని గోండ్వానా సాహిత్య అకాడమీ ద్వారా విడుదల చేశాడు.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!