Manipur: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా!

మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.  కొంత కాలంగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Biren singh

Biren singh Photograph: (Biren singh)

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గత కొంత కాలం నుంచి మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమైనట్లు సమాచారం వచ్చింది. దీంతో బీరెన్ సింగ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండిMastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

ఆడియోలు లీక్ కావడంతో..

రెండు జాతుల మధ్య గత రెండేళ్ల నుంచి మణిపూర్‌లో గొడవులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 250 మంది మృతి చెందారు. అయితే ఈ అల్లర్లను ఆపడంలో బీరెన్ ప్రభుత్వం విఫలమైందని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ హింసను ప్రేరేపించడం వెనుక సీఎం హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆడియోలు కూడా లీక్ కావడంతో ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు