/rtv/media/media_files/2025/03/12/B7JpZDHWA6FOP4g40VJL.jpg)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషాగా నటించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని మోసాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నిందితులను ఢిల్లీ నుండి ఇంఫాల్‌కు తీసుకువచ్చారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 319(2) సెక్షన్‌ల కింద కేసు బుక్ చేశారు.
ముగ్గురు మోసగాళ్లను ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ IIIకి చెందిన ప్రియాంషు పంత్ (19), ఉత్తరప్రదేశ్‌లోని ఎటాకు చెందిన ఉవైష్ అహ్మద్ (19), ఢిల్లీలోని ఘరియాపూర్‌కు చెందిన గౌరవ్ నాథ్ (19)గా గుర్తించారు. గత నెలలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, రాష్ట్ర శాసనసభ్యులలో చాలా మందికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.4 కోట్ల చొప్పున ఇస్తే మంత్రి పదవులు ఇస్తామని నిందుతులు ఆఫర్ చేశారని పోలీసులు వెల్లడించారు.
Also read : కేసీఆర్ వస్తారా.. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు!
స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత ఫిర్యాదుతో
అనుమానంతో స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత ఫిబ్రవరి 15న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా వారిని అరెస్ట్ చేశారు. పోలీసు కస్టడీ రిమాండ్ కోరుతూ ముగ్గురిని సిజెఎం ఇంఫాల్ వెస్ట్ కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని శాసనసభ్యులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఏర్పడింది.
కాగా ఫోన్ లో జై షాగా నటించి ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్ నుండి రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన 19 ఏళ్ల వ్యక్తిని కూడా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
Also Read : మూడో భార్య ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న షోయాబ్ మాలిక్!