మైనర్ బాలుడితో భార్యకు అఫైర్ ఉందని అనుమానించిన భర్త.. చివరికి ఏం చేశాడంటే హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. By B Aravind 17 Oct 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆమె భర్త అనుమానించాడు. చివరికి అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చాడు. తన స్నేహితుడితో కలిసి గొంతు పిసికి హత్య చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి ఇక వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 26న ఖలీల్‌పూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రోజున ఖలీల్‌పూర్ గిలావాస్ డ్యామ్ వద్ద బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అదృశ్యమైన యువకుడి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఖలీల్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల అమిత్ కుమార్, 29 ఏళ్ల అతడి స్నేహితుడు తరుణ్ అలియస్ జోనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు బాలుడిని తామే హత్య చేశామని ప్రధాన నిందితుడు అమిత్ కుమార్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తన భార్యతో ఆ బాలుడికి అక్రమ సంబంధం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఖలీల్‌పూర్ గిలావాస్ డ్యామ్ దగ్గరికి బాలుడిని తీసుకెళ్లి మత్తు ఇచ్చానని.. ఆ తర్వాత అతడిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం! Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా! #national-news #crime #haryana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి