/rtv/media/media_files/2026/04/08/man-in-coma-since-2025-2026-04-08-19-56-59.jpg)
Man In Coma Since 2025, Wife Seeks Court Approval To Preserve His Sperm
ఢిల్లీ హైకోర్టులో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. కోమాలో ఉన్న తన భర్త వీర్యం కావాలని ఓ మహిళ పిటిషన్ వేసింది. గతేడాది మార్చి నుంచి ఆయన కోమాలో ఉన్నారని.. భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లి అయ్యేందుకు అతడి వీర్యం కావాలని కోరింది. ఇందుకోసం కోర్టు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించింది. పిటిషనర్ తరఫున ఆమె న్యాయవాది అర్జిత్ గౌర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Also read: ముస్లిం పురుషులు మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు కీలక తీర్పు
ఇక విరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తకు 2025 మార్చి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో అతడు కోమాలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతడు ఇంకా వెంటిలేటర్ సపోర్ట్‌పైనే జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి భార్య తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భవిష్యత్తులో తన భర్త ద్వారా తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయన వీర్యాన్ని సేకరించి నిల్వ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని కోరింది. అర్జిత్ గౌర్ అనే న్యాయవాది పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు.
Also Read: కేంద్ర క్యాబినెట్ సమావేశం.. 5 కీలక నిర్ణయాలు
తన భర్త ఉన్న కండిషన్‌లో వీర్యాన్ని సేకరించడం సురక్షితమా.. కాదా అనేది నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అయితే సర్జికల్ విధానంలో చూసుకుంటే వీర్యాన్ని నేరుగా టెస్టికల్స్ నుంచి ఫైన్ నీడిల్‌తో సేకరించవచ్చని IVF నిపుణులు డా.శివాని సచ్‌దేవ్ తెలిపారు. అయితే ప్రస్తుతం చట్ట ప్రకారం వీర్యాన్ని సేకరించేందుకు భార్యభర్తలిద్దరి అంగీకారం కావాలి. ఇక ముందస్తు ఆమోదం ఉంటే భర్త మరణించిన తర్వాత కూడా వీర్యాన్ని సేకరించవచ్చు. కానీ ఈ కేసు భిన్నంగా ఉండటంతో సందిగ్ధత ఏర్పడింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది.
Follow Us