/rtv/media/media_files/2025/03/24/v3L3hezAJArvM2zSyk1T.jpg)
Graveyard
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. కొడుకు వెనకాల పైక్‌పై వచ్చాడు. బాధతో గుండెపోటు గురై మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లో లయిక్ అహ్మద్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో మార్చి 20న కుటుంబ సభ్యలు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
చికిత్స తీసుకుంటూనే లయిక్ అహ్మద్ మరణించారు. దీంతో ఆయన చిన్న కొడుకు అతిక్.. తండ్రి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో షాక్ అయిపోయాడు. దీన్ని నమ్మలేకపోయాడు. దీంతో వెంటనే గుండె నిపుణులున్న మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. విషయం అర్థం చేసుకున్న అతిక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. చివరికీ లయిక్ అహ్మద్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి అంబులెన్స్‌లో తరలించారు.
Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
అతిక్ అంబులెన్స్ వెనుకే బైక్‌పై వచ్చాడు. అతనికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఆయన మరణించాడన్న విషయాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆ బాధలో మార్గమధ్యంలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతిక్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. తండ్రి, కొడుకులు ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్లిద్దరి మృతదేహాలు కలిసికట్టుగా ఒకేచోట ఖననం చేయడం అక్కడి స్థానికులను కంటతడి పెట్టించింది.
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
Also Read: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్
rtv-news | Uttar Pradesh crime | national-news