బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందుగా ఆకాశ్ కోజియా అనే యువకుడిని నిందితుడితో పోలికలు ఉన్నాయనే అనుమానంతో ఛత్తీస్‌గఢ్‌లోని దర్గ్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో ఆకాశ్‌కు అసలు సంబంధమే లేదని తేలింది. దీంతో అతడిని విడిచి చేపట్టారు. అయితే తాజాగా ఆకాశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సైఫ్ కేసులో అరెస్టు అయిన తర్వాత తన జీవితం నాశనమైనందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
ఈ కేసులో తాను ఇరుక్కోవడం వల్ల డ్రైవర్‌గా పనిచేస్తున్న తన ఉద్యోగం పోయిందని.. ఇటీవల వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యిందని, అలాగే తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కుంటొందని వాపోయాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియా నా ఫొటోలు వచ్చాయని.. దీన్ని చూసిన మా కుటంబం షాకైపోయిందని చెప్పాడు. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో తనను అరెస్టు చేసి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అలాగే అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు కూడా తనపై దాడి చేశారంటూ తన బాధను వివరించారు.
Also Read: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్
చివరికి అసలు నిందితుడిని నేను కాదని తేలాక పోలీసులు విడిచిపెట్టారని.. ఆ తర్వాత తన ఉద్యోగం పోయిందన్నాడు. తను చేసుకోబోయే అమ్మాయి తరఫు కుటుంబీకులు కూడా పెళ్లి క్యాన్సిల్ చేస్తూ నిర్ణయించుకున్నారని తెలిపాడు. తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట మాత్రం నిజమేనని ఒప్పుకొన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల ముంబయిలోని బాంద్రాలో సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దొంగతనం కోసం వచ్చిన దుండగుడిని సైఫ్ అడ్డుకునేందుకు యత్నించగా.. అతడు సైఫ్‌ను కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే డిశ్చార్జి కూడా అయ్యారు.