![Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్- బెంగాల్ సిఎం మమత బెనర్జీ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)
కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్య, రేప్ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది. సుదీర్ఘ విచారణ తర్వాత అతనికి జీవిత ఖైదు విధిస్తూ బెంగాల్‌లోని సీల్దా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అతను బతికున్నంత వరకూ జైలు శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పింది. దాంతో పాటూ అలాగే రూ.50వేల జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 102 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించింది న్యాయస్థానం.
హైకోర్టుకు వెళతాం..
అయితే సంజయ్ రాయ్ శిక్షపై ఎవరూ సంతృప్తిగ లేరు. అతనికి ఉరిశిక్ష విధించాలని కోలకత్తాలోని విద్యార్థులు, మిగతా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమకు పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని బాధిత కుటుంబం చెప్పింది. ఇక బెంగాల్ ప్రభుత్వం దీని మీద కీకల నిర్ణయం తీసుకుంది. సంజయ్ రాయ్ జీవిత ఖైదుశిక్షను సవాల్ చేయాలని డిసైడ్ అయింది. వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పడిన దోషికి ఉరి శిక్ష విధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరుతామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీనిపై తన సోషల్ మీడియాలో ఆమె రియాక్ట్ అయ్యారు.
ఆర్జీకర్ హాస్పిటల్ వైద్యురాలు రేప్ అండ్ మర్డర్ కేసు సాధారణమైనది కాదని...దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పుకు తాను షాక్ అయ్యానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీనికి కచ్చితంగా ఉరిశిక్ష వేయాలని తాను అనుకుంటున్నాని చెప్పారు. గతంలో ఇటువంటి నేరాల్లో దోషులకు ఉరిశిక్ష పడేలా చేశామని చెప్పారు. అలాంటప్పుడు ఇందులో మాత్రం సంజయ్‌రాయ్‌కు జీవిత ఖైదు వేసి ఎలా ఊరుకున్నారో అర్ధం కావడం లేదని మమతా రాసుకొచ్చారు. అందుకే తాము హైకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
Also Read: Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్ తో అదరగొట్టిన ట్రంప్!