/rtv/media/media_files/2025/04/02/RckNbt2lzME5scMcyZCd.jpg)
gandhi
Mahathma Gandhi: మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్.. మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలు. నీలంబెన్ తన కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్‌తో కలిసి నవ్‌సరి జిల్లాలో ఉంటున్నారు.
నా తల్లికి ఎటువంటి అనారోగ్యం లేదు
పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం పాటు పడ్డారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించింది, తన జీవితాన్ని వ్యార (సత్యం) కు అంకితం చేసింది. నా తల్లికి ఎటువంటి అనారోగ్యం లేదు కానీ గత కొన్ని రోజులుగా, ఆమె వయస్సు కారణంగా భోజనం దాదాపుగా మానేసింది.
Also Read: Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!
ఆమెకు తీవ్రమైన ఆస్టియోపోరోసిస్ ఉంది మరియు క్రమంగా క్షీణిస్తోంది. ఈ ఉదయం, నేను నా ఆసుపత్రికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఆమె పక్కన కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాను.
క్రమంగా ఆమె నాడి తగ్గుతున్నట్లు నాకు అనిపించింది. మరియు ఆమె నెమ్మదిగా క్షీణిస్తోంది. ఆమె ప్రశాంతంగా, ఎటువంటి బాధ లేదా నొప్పి లేకుండా మరణించింది” అని డాక్టర్ చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబంపై గాంధీ సిద్ధాంతాలను రుద్దకపోయినా, ఆమె వ్యక్తిగత విలువలే తన జీవితంలో తనకు స్ఫూర్తినిచ్చాయని డాక్టర్ పారిఖ్ అన్నారు.
Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
Also Read: Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
great grand daughter | mahathma-gandhi | nilamben parikh | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates