/rtv/media/media_files/2025/02/25/RpCr2BMF8x50qRFSkxpx.jpg)
Mahashivratri 2025 special Holidays
హిందూ గ్రంథాలలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి బుధవారం అంటే ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ పర్వదినాన భోలేనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడిపై భక్తి, శ్రద్దలతో ఉపవాసాలు, జాగారాలు పాటిస్తారు.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
రేపు సెలవు
మహాశివరాత్రి నాడు మహాదేవుడిని పూజించడం వల్ల సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శ్రేయస్సు, ఆనందం లభిస్తుందని హిందువులు గట్టిగా నమ్ముతారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు లభించాయి. వీటితో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఫిబ్రవరి 26న మూసివేయబడతాయి. అయితే ఈ వారం వరుసగా కాకపోయినా అనేక నగరాల్లోని బ్యాంకులు రెండు రోజులు మూతపడనున్నాయి.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
రాష్ట్రాల వారీగా సెలవులు
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి 2025 సందర్భంగా అనేక రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ- శ్రీనగర్, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
మరొక పండుగ
అలాగే ఫిబ్రవరి 28న లోసర్ పండుగ కోసం కేవలం గాంగ్‌టాక్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల బ్యాంకు సంబంధిత పనులను ముందుగానే పరిష్కరించుకోవాలని వినియోగదారులకు సూచించారు.
అయితే మహాశివరాత్రి, ఇతర ప్రాంతీయ పండుగలకు బ్యాంకులు మూసివేసినప్పటికీ.. నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సేవలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2025 కోసం అన్ని బ్యాంకు సెలవులను జాబితా చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక క్యాలెండర్‌ను విడుదల చేసింది.