/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గఢ్ జిల్లాలోని అంబెనాలి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే..
సతారా జిల్లాకు చెందిన వారంతా పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రహదారి గుండా కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా దాపోలి అనే ప్రాంతం నుంచి తిరిగి తమ సొంత ఊరైన సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘాట్ రోడ్డు కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో దాదాపు 1000 అడుగుల లోతులో కారు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘోరం జరిగింది. అంబెనాలి ఘాట్ సెక్షన్‌కు చేరుకోగానే వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, కారు రోడ్డు పక్కనే ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
#Raigad (#Maharashtra): At least 8 people died as a #Scorpio plunged into deep gorge near Ambenali Ghat in Maharashtra’s Raigad. The major accident was reported at Ambenali Ghat, located between #Mahabaleshwar and #Poladpur. pic.twitter.com/3q1vFftCVj
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 25, 2026
ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!
महाबलेश्वर के पास बड़ा हादसा !
— sunilkumar singh (@sunilcredible) May 25, 2026
रायगढ़ के आंबेनली घाट पर स्कॉर्पियो 1500 फीट गहरी खाई में गिरी। सातारा के 8 युवकों की मौके पर मौत।
कोंकण से लौट रहे थे। रेस्क्यू ऑपरेशन जारी।#Mahabaleshwar#Accident#Satarapic.twitter.com/dcN0BgjXyg
Follow Us