/rtv/media/media_files/2026/02/18/muslim-reservation-2026-02-18-16-21-29.jpg)
మహారాష్ట్ర ప్రభుత్వం(maharashtra government news) అక్కడి ముస్లింలకు భారీ షాక్ ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వేళ, విద్యా సంస్థల్లో ముస్లింలకు కల్పిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పాత సర్క్యులర్లు, ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ తాజా చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ముస్లింలకు విద్యలో 5 శాతం కోటా కల్పిస్తూ 2014లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్లు(muslim-reservations) అమలులోకి వచ్చాయి. అయితే, దీనిపై సరైన చట్టం లేకపోవడం, కోర్టుల స్టేలు వంటి సాంకేతిక కారణాలతో గత పదేళ్లుగా ఈ అంశంపై గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఫడ్నవీస్(9cm devendra fadnavis) ప్రభుత్వం ఆ అనిశ్చితికి తెరదించుతూ, కోటాను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు, అలాగే కొత్తగా కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయబడవు.
Also Read : శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్లో పరిస్థితి ఏంటి ?
Maharashtra Government Scraps 5% Reservation For Muslims
ప్రభుత్వ నిర్ణయంపై మైనారిటీ నాయకులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చే రంజాన్ కానుక ఇదేనా?" అని AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రశ్నించారు. ముస్లింలలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉందని హైకోర్టు అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమని మండిపడ్డారు. అయినప్పటికీ ముస్లిం విద్యార్థులు చదువు ఆపకూడదని ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల హక్కులను ప్రభుత్వం ఎందుకు కాలరాస్తోందని వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ ప్రశ్నించారు. ఇది ముస్లిం సమాజంపై జరిగిన పెద్ద దాడి అని అభివర్ణించారు.
రిజర్వేషన్ల రద్దుతో పాటు మైనారిటీ వ్యవహారాల శాఖలో జరిగిన కొన్ని అక్రమాలపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్పై వేటు పడింది. కేవలం వారం రోజుల వ్యవధిల్లో రికార్డు స్థాయిలో 75 విద్యా సంస్థలకు మైనారిటీ హోదా కల్పించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన తర్వాత రాష్ట్రం సంతాప దినాల్లో ఉన్న సమయంలో కొన్ని ఫైళ్లపై డిజిటల్ సంతకాలు ఎలా జరిగాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 75 సంస్థల హోదాను నిలిపివేస్తూ, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.
Also Read : మోదీ ధరించిన ఆ స్మార్ట్ గ్లాసెస్.. చూస్తే రాస్తుంది, చెప్తే వింటోంది
Follow Us