/rtv/media/media_files/2024/11/27/OJ2cDpuA6tWbGGqC4n44.jpg)
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తెలలేదు. మంగళవారం రాజ్‌భవన్‌లో ఏక్‌నాథ్ షిండే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ షిండేనే సీఎం చేయాలని అనుకుంటే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చు. ఆయన రాజీనామా చేయడంతో.. షిండేకు ఇక ముఖ్యమంత్రి పదవి లేదనేది స్పష్టమవుతోంది.
కేంద్ర కేబినెట్‌లోకి షిండే!
ఈ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 132 సీట్లు వచ్చాయి. దీంతో సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే హైకమాండ్ సీఎంగా బాధ్యతలు అప్పగించనుందని తెలుస్తోంది. అయిచే షిండే సీఎం పదవిని వదులుకున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించాలని లేదా కేంద్ర కేబినెట్‌లోకి రావాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ పవార్ షిండేకు డిప్యూటీ సీఎం ఇవ్వకూడదని హైకమాండ్‌తో చెబుతున్నట్లు సమాచారం. మరి షిండే కేంద్ర మంత్రి పదవినీ తీసుకుంటారా లేదా రాష్ట్రంలోనే మంత్రిగా ఏవైనా కీలక శాఖలు ఇవ్వాలని పట్టుబడుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మంగళవారం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, షిండే శిబిరం నేతల మధ్య సమావేశం జరిగింది. తనకు సీఎం పదవి లేకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబడినట్లు సంబంధింత వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభ్రిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్ఠానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంకా మంతనాలు జరుగుతున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ గడువు మంగళవారంతో ముగిసింది.
ఇది కూడా చూడండి: రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం
షిండే తన పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ దాన్ని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు షిండేను తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. మరోవైపు మహారాష్ట్రంలో బీహార్ ఫార్ములాను కూడా అమలు చేయాలని షిండే గ్రూప్ నేతలు కోరుతున్నారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్‌కు ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. షిండే నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు మహాయుతి కూటమి గెలుపునకు తోడయ్యాయని అందుకే మళ్లీ షిండేను సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గం నేతలు కోరుతున్నారు.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
బీహర్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు
అయితే బీహార్ ఫార్ములా మహారాష్ట్రలో పనిచేయదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బలమైన నాయకత్వం ఉందని.. అందుకే అలాంటి అవకాశం లేదని అంటున్నారు. మరికొన్ని గంటల్లో సీఎం ఎవరూ అనేది ఎన్డీయే కూటమి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరి షిండే విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలాఉండా ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి 231 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీ 132 సీట్లు సాధించగా.. శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41 సీట్లు సాధించాయి. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 46 స్థానాలకే పరిమితమై ఓటమి పాలయ్యింది.
ఇది కూడా చూడండి: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు