Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం

మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ వాళ్లతో ప్రమాణం చేయించారు. అయితే మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
cabinet2

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా, ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ వాళ్లతో ప్రమాణం చేయించారు. 

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

Maharashtra Cabinet Expansion

బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావాన్‌కులే, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరీశ్‌ మహాజన్‌, అతుల్‌ సావే, అశోక్‌ ఉయికే, ఆశిశ్‌ శేలార్‌, శివేంద్రసిన్హ భోసలే తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి  గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, శంభూరాజ్‌ దేశాయ్‌, ఉదయ్‌ సామంత్‌, సంజయ్‌ రాథోడ్‌ ప్రమాణ చేశారు. ఇక ఎన్సీపీ నుంచి  దత్తత్రేయ భార్నే, అధితీ తాత్కరే, ధనంజయ్‌ ముండే, హసన్‌ ముష్రిఫ్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

డిసెంబర్ 5న మహాయూతి ప్రభుత్వం కొలువుదీరింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ఏకంగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే మహారాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో బీజేపీకి 20, శివసేనకు 13, ఎన్సీపీకి 10 మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది.  

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు