/rtv/media/media_files/2025/02/24/3wPjuay3xP1wcMT2fb9O.jpg)
కోట్లాది మంది ప్రజలు తమ పాపాలను కడుక్కోవడానికి ప్రయాగ్‌రాజ్ లోని మహా కుంభమేళాకు వెళ్తుంటే మరికొంతమంది మాత్రం ఆ ఫుణ్యనది ఒడ్డునే పాపాలకు పాల్పడుతున్నారు. మోక్షంలో కూడా తప్పు చేస్తున్న పాపాత్ములు వీళ్లు. మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేసిన వీడియోలు తీసి రేటు కట్టి మరి అమ్మేస్తున్నారు. మహిళలు బట్టలు మార్చుకుంటున్న అనేక వీడియోలను తీసి, ముఖ్యంగా బాలికల అభ్యంతరకరమైన వీడియోలను తీసి సోషల్ మీడియాలో అమ్ముతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలాంటి వీడియోలను కొనుగోలు చేసి చూసిన వారి సంఖ్య కూడా వేలల్లో, లక్షల్లో ఉన్నారు. ఒక్కో వీడియోకు దాదాపు 90 రూపాయల నుండి 1800 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలపై ఫిబ్రవరి 17న కుంభమేళా పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టగా వీరంతా టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానెల్‌ల ద్వారా ఈ వీడియోలనే అమ్ముతున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు.
మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను
ముందుగా ట్విట్టర్,ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను బ్లర్ చేసి చూపించి.. పూర్తి వీడియో చూడాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ కు వెళ్లడంటూ లింకు ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లాక వీడియోకు రేటు పెట్టి అమ్మేస్తున్నారు. ఈ టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానెల్‌లు కేవలం ఒకటి నుండి రెండు రోజులు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. ఆ తరువాత కొత్త ఛానెల్ పేరుతో ఓపెన్ చేసి దందా షురూ చేస్తారన్నమాట.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలన్నీ కేవలం మహా కుంభమేళావి మాత్రమే కాదు వీటిలో చాలా వీడియోలు హరిద్వార్, ఇతర ప్రదేశాలలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వాటినే మహా కుంభమేళానికి చెందినవిగా అమ్ముతున్నారు. ఇంకో దారుణం విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 మధ్య, ఇండియాలో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్ యాప్‌లో ఓపెన్ బాతింగ్ అని ఎక్కువగా సెర్చ్ చేశారు.
ఇక మహా కుంభమేళా ముగియడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. మహా కుంభమేళాలో చివరి రోజు అంటే ఐదవ రోజు మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు సంగం హా కుంభమేళా చేరుకుంటారని అంచనా.
Also Read : ఐదుగురిని కిడ్నాప్ చేసి .. ముగ్గురు బాలికలపై 18 మంది అత్యాచరం .. నిందితులందరూ మైనర్లే !