/rtv/media/media_files/2025/02/10/zwpKXaRfIrNf3sjndvA5.jpg)
heart attack death
Heart Attack While Dancing: ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో (Hear Attack) మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డాన్స్ చేస్తూ, తింటూ, వాకింగ్ చేస్తూ, జిమ్ చేస్తూ ఇలా రకరకాల సందర్భాల్లో కన్ను మూసి తెరిచేలోపు గుండెపోటుకు బలవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ విషాద ఘటనే మధ్యప్రదేశ్ లోని విధిశా జిల్లాలో జరిగింది.
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
డాన్స్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ | Heart Attack While Dancing..
అయితే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన పరిణీత జైన్ అనే యువతి సోదరి సంగీత్ ఫంక్షన్ లో స్టేజ్ పై డాన్స్ వేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించిన లాభం లేకపోయింది. అప్పటికే ఆమె హార్ట్ ఎటాక్ తో (Hear Attack) మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుకల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సోదరి సంగీత్ ఫంక్షన్ లో ఎంతో ఆనందంగా, సరదాగా డాన్స్ వేసిన కూతురు ఇక లేదని తెలియడంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో పరిణితి సోదరుడు కూడా 12 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించాడట. ఇలా ఇద్దరు పిల్లలు గుండెపోటుతో చనిపోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి
SHOCKING NEWS 🚨
— imran ali (@imu07280300033) February 9, 2025
Woman Dies at Wedding Dance in Madhya Pradesh
Parinita Jain, a 23-year-old woman from Indore, tragically collapsed and died while dancing at her cousin's wedding in Vidisha, Madhya Pradesh due to Heart Attack. #HeartAttack pic.twitter.com/V8dyXX4aDD
Also Read: Sankranthiki Vasthunam: వావ్! అప్పుడే టీవీలో వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'..! నవ్వులే నవ్వులు
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam