/rtv/media/media_files/2025/03/27/BbbTQ9HjP64dODrL0afL.jpg)
School teacher loses over Rs 78 lakh in 22-day 'igital arrest
‘‘మేము పోలీస్ ఆఫీసర్లం. మీ పేరుతో కొత్త అకౌంట్ ఓపెన్ చేయబడింది. ఆ అకౌంట్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయి. దీని కారణంగా మీపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. మీ అకౌంట్లో ఉన్న డబ్బును పంపించండి. ఇన్విస్టిగేషన్ పూర్తయ్యాక మళ్లీ తిరిగి పంపిస్తాం’’ అని నమ్మబలుకుతూ వాట్సాప్ కాల్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో కొందరు సైబర్ కేటుగాళ్లు రిటైర్డ్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్కూల్ టీచర్స్, వృద్దులనే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
టీచర్‌కు సైబర్ వల
తాజాగా అలాంటిదే మరో సంఘటన లక్నోలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా మాన్సింగ్ రీసెంట్‌గా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. మొదటగా ఆ సైబర్ నేరస్తులు ఆమెకు వాట్సాప్ కాల్ చేశారు. అనంతరం ఆమె పేరుతో ఢిల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక అకౌంట్ ఓపెన్ చేయబడిందని.. దాని నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తాము గుర్తించామన్నారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
అందువల్లనే మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని ఆమెను బెదిరించారు. ఇన్విస్టిగేషన్ కోసం అకౌంట్‌లో ఉన్న డబ్బులు తమకు పంపించాలని.. ఇన్విస్టిగేషన్ పూర్తయ్యాక తిరిగి మీ అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేస్తామని నమ్మబలికారు. ఇదంతా నిజమే అనుకుని నమ్మిన టీచర్ ప్రమీళా వారి వలకు చిక్కారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
అయితే తాము చెప్పే వరకు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని.. ఇది సీక్రెట్ ఆపరేషన్ అని వారు ఇంకాస్త ఆమెను బెదిరించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. ఇందులో భాగంగానే డిజిటల్ అరెస్టు కింద ఉంచినట్లు ఆమెకు చెప్పారు. దీంతో గజగజ వణికిపోయిన ఆ టీచర్.. కేవలం 22 రోజుల వ్యవధిలో దాదాపు రూ.78 లక్షలను కేటుగాళ్ల ఖాతాలకు ట్రాన్సఫర్ చేసింది. తర్వాత మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
(crime news | cyber scam india | Cyber crime call | latest-telugu-news)