/rtv/media/media_files/2025/02/19/XIhJQ2iZQekiHkhgGhfB.jpg)
Karnataka CM Siddaramaiah, Photograph: (Karnataka CM Siddaramaiah,)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య ముడా స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్రతో సహా పలువురు సీనియర్ ముడా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై గవర్నర్ విచారణకు అనుమతించారు. ఈ క్రమంలో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్తా నుంచి సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది.
Lokayukta police says no evidence found against Karnataka CM Siddaramaiah, his wife and others in MUDA case
— Manjeet Ghoshi (@ghoshi_manjeet) February 19, 2025
some liberals want his resignation Congress means governance, not fraud like Narendra Modi. pic.twitter.com/WK96HZxuJ3
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూకుంభకోణంలో ఆయనకు లోకాయుక్త బుధవారం క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపుల వివాదంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సీఎం సిద్ధరామయ్య కుట్ర చేశారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమి కర్ణాటక ప్రభుత్వం తీసుకొని అంతకన్నా ఎక్కువ విలువైనా భూములను పరిహారం కింద ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.45 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్‌లో కీలకమైన విజయనగర్‌లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆరోపించింది. విచారణ జరిపిన లోకాయుక్తా సిద్ధరామయ్య, అతని కుటుంబం అవినీతికి పాల్పడ్డారనడానికి ఆధారాలు లేవని తేల్చింది.