/rtv/media/media_files/2025/03/04/hSWHYZRhXCDPZbj3J0ok.jpg)
Ranya Rao
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయింది నటి రన్యారావు. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. రన్యారావు బంగారం తీసుకొచ్చిన విధానం, ఆమె అనుసరించిన మార్గాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఎయిర్ పోర్ట్ లో ఆమెను కస్టడీలోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు అప్పటి నుంచీ విచారిస్తూనే ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా నిన్న రన్యారావు పోలీసులు ముందు నోరు విప్పిందని..స్టేట్ మెంట్ ఇచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి. తాను బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని..ఇదంతా ఎలా చేయాలో యూట్యబ్ చూసి నేర్చుకున్నానని ఆమె పోలీసులకు చెప్పిందని తెలుస్తోంది. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలో తాను యూట్యూబ్ లోనే చూసి తెలుసుకున్నానని రన్యారావు అధికారులకు చెప్పినట్లు సమాచారం.
అన్నివైపుల నుంచీ దర్యాప్తు..
నటి రన్యారావు గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఈమెపై సీబీఐ కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యారావుతో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది గుర్తిచేందుకు సీబీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. సీబీఐ అధికారులు రన్యారావు ఇల్లు, ఆమెకు సంబంధించిన అన్ని ప్రాంతాలు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్‌కు వెళ్లి విచారణ జరుపుతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
అయితే రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ కేసు విషయం సీఎం వరకు వచ్చినట్టయింది. ఫొటోలో హోంశాఖ మంత్రి జి . పరమేశ్వర కూడా ఉన్నారు. అంతకు ముందే నటి స్మగ్లింగ్ కేసులో రాజకీయ హస్తం కడా ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా ఆమె పెళ్ళిలో ముఖ్యమంత్రి , రాజకీయ నాయకులు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో స్మగ్లింగ్ లో ఆమెతో సంబంధమున్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రన్యారావు పెళ్లికి హాజరైన అతిథులు, వారిచ్చిన కానుకలపై దృష్టి సారిస్తున్నారు.
Also Read: USA: మళ్ళీ వాయిదా పడ్డ ప్రయోగం..సునీతా విలియమ్స్ రాక ఇంకా ఆలస్యం