/rtv/media/media_files/2025/02/15/oFNWzf224708oZLvXomC.jpg)
Law against 'love jihad' in Maharashtra soon
మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్‌పై సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకునేందుకు చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కమిటీ కూడా వేసింది. దీనికి సంజయ్ వర్మ నాయకత్వం వహించనున్నారు. బలవంతంగా మత మార్పిడులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, లవ్ జిహాద్‌ఘటనలకు ఆపేలా న్యాయపరంగా ఉండే అవకాశాలను ప్రభుత్వానికి ఈ కమిటీ రిపోర్ట్ చేయనంది.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
2022లో మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయంలోనే లవ్ జిహాద్ అనే అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి.
Also Read: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి!
దీనిపై కొన్నిరోజుల పాటు మీడియా, సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం లవ్‌జిహాద్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యులతో మహాయుతి కూటమి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఏర్పాటు చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!