/rtv/media/media_files/2025/03/08/pa2NwF5IybYsgoHmwEXJ.jpg)
Lalith Modi
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ..భారత్ నుంచి పారిపోయి లండన్ లో ఉంటున్నారు. ఐపీఎల్ కు బాస్ గా ఉన్న సమయంలో ఈయన కోట్లాది రూపాలు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన భారత్ లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు లండన్ లో అజ్ఞాతవాసం చేస్తున్న లలిత్ మోదీ రీసెంట్ గా తన పాస్ పోర్ట్ ను అక్కడి భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని చెప్పారు. ఇది ఇలా ఉంటే లలిత్ మోదీ వల్ల ఒక ద్వీపం గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు ఈ పేరు కూడా వినని వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకించి గూగుల్ లో దీని గురించి సెర్చ్ చేస్తున్నారు.
వానుఆటు ద్వీపం...
వాటు ఆటు ఇదొక దేశం. 80 ద్వీపాల సమూహం. అందుకే దీన్ని ద్వీపదేశం అంటారు. ఇక్కడ ప్రపంచంలో ఉన్న సంపన్నులు అందరికీ పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు లలిత్ మోదీ కూడా వాటు ఆటు గోల్టెన్ పాస్ పోర్ట్ కింద ఆ దేశ పారసత్వం తీసుకున్నారు. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకే దానిని తీసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రియా దగ్గరలో ఈ వాటు ఆటు ఉంటుంది. స్థానికంగా, అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా దేనిపైనా అక్కడ ఆదాయపన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను కూడా ఉండదు. ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా తమ వ్యాపారాలను చేసుకోవచ్చును. ఆ దేశంలో వారసత్వ లేక కార్పొరేట్ పన్ను లేదు. వాను ఆటులో తమ వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకొని.. దేశం బయటి నుంచి ఆదాయాన్ని పొందినా, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దాంతో పాటూ గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్ లు కూడా ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేశం ప్రస్తుతం మంచి డిమాండ్ లో ఉన్న క్రిప్టో హబ్ గా ఉంది. 2024లో హ్యాపీ ప్లానెట్ గా వాటు ఆటు మొదటి స్థానంలో నిలిచింది.
డబ్బులుంటే వాటుఆటు గోల్డెన్ పాస్ పోర్ట్ ను ఎవరైనా కొనుక్కోవచ్చు. వారికి మిగతా దేశాల్లో నేర చరిత్రలున్నా సరే. ఈ ధీమాతోనే లలిత్ మోదీ...భారతదేశం బాధ తప్పించుకోవడానికి ఇక్కడికి చేరారు. ఈ పౌరసత్వం కోసం అతను బోలెడు కోట్లు కుమ్మరించారని తెలుస్తోంది. ఐపీఎల్ ద్వారా కొట్టేసిన, సంపాదించన పొమ్మతో వానుఆటులో జల్సా చేయడానికి డిసైడ్ అయ్యారు లలిత్ మోదీ.
Also Read: Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు