Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్

కునాల్ కామ్రా మరోసారి వివాదాస్పద వీడియో పోస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని దేశద్రోహి అని పిలిచారు. తాజాగా నిర్మలా సీతారామన్‌పై ట్యాక్స్ గురించి ట్రోల్ చేసి కునాల్ పేరడీ పాట పాడారు. దీంతో ఆయనకు 2వ సారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

New Update
kunal kamra

kunal kamra Photograph: (kunal kamra)

మహారాష్ట్రలో ఎన్నికలు లేకున్నా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కమెడియన్ కునాల్ కామ్రా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన పేరడీ పాటతో బీజేపీ, శివసేన లీడర్లపై సెటైర్లతో విరుచుకు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కునాల్ కామ్రా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని దేశద్రోహి అని అన్నాడు. ఈ విషయంలో శివసేన లీడర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు సదరు కమెడియన్ కునాల్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. షిండే ఆయనపై పరువు నష్టం దావా వేశారు. బుధవారం కునాల్ కామ్రా మరో వీడియో రిలీస్ చేశాడు. ఈ సారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై పేరడీ చేస్తూ పాట పాడారు. హిందీ సినిమా పాట అయిన హవా హవాయి సాంగ్‌ను పేరడీ చేసి ఆప్కా టాక్స్ కా పైసా హో రహా హై హవా హవాయి (మీ ట్యాక్స్ డబ్బులు వేస్ట్ కాబోతున్నాయి) అంటూ పేరడీ సాంగ్ పాడారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు, బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తూ పాట పాడాడు కునాల్ కామ్రా. 

Also read: Man Rapes Goat: నీ కామం తగలెయ్య.. మేకను కూడా వదల్లేదు కదరా..!

బీజేపీ నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. షిండేపై వ్యాఖ్యలు చేసినప్పుడే ఆయనకు కోర్టు నుంచి నోటీసులు పంపించారు. కాగా ఇప్పుడు మరోసారి ఆయనకు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపించారు. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు