/rtv/media/media_files/2025/03/24/tw0CX2GWaZYxAnv1dMW1.jpg)
Kunal Kamra jokes on Shinde Photograph: (Kunal Kamra jokes on Shinde )
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై జోక్స్ వేసినందుకు శివసేనా నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఓ స్టాడంప్ కామిడీ షోలో కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం లేపుతుంది. కమెడియన్ చేసిన కామెంట్స్ వీడియోలు వైరల్ కావడంతో శివసేనా కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. కామ్రా చేసిన షో వేదికను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిని ఉద్ధవ్ ఠాక్రే సేన దాడిని ఖండించింది. కునాల్ కామ్రాను చంపుతామని, దాడి చేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. శివసేన కార్యకర్తలు ఈ షో రికార్డ్ చేయబడిన ముంబైలోని ఒక హోటల్‌ను ధ్వంసం చేశారు. కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై కునాల్ కమ్రాపై కేసు నమోదైంది. ఉపముఖ్యమంత్రి షిండేను అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర జరుగుతుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also read: MMTS Train Incident: హైదరాబాద్ దారుణం.. MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) March 23, 2025
Satirical act by comedian #KunalKamra has triggered political backlash in #Maharashtra. Enraged by his jibes at Deputy CM Eknath Shinde, workers from Shinde-led Shiv Sena vandalised Kamra’s office in Andheri
The fallout continues, several Shiv Sena MLAs now filing… pic.twitter.com/PrxQmt7atI
Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
శివసేన, కామ్రా, శివసేన (UBT) నాయకులు సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన నయా భారత్ అనే షోలో ప్రస్తుత రాజకీయాలను విస్తృతంగా చర్చించిన కామ్రా, పార్టీని చీల్చి బిజెపితో జతకట్టినందుకు షిండేను విమర్శించాడు. ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను దేశద్రోహి అని పిలిచాడు. కామ్రా స్వయంగా షేర్ చేసిన షోలోని ఒక క్లిప్‌లో ఆయన దిల్ తో పాగల్ హై పాటను పాడుతూ షిండేపై జోక్స్ వేశారు. కునాల్ కామ్రా ఉపముఖ్యమంత్రి షిండేపై బాడీ షేమింగ్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఆయన సమీకరణం గురించి వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ క్లిప్‌లో కామ్రా షిండే పేరును ఇన్ డైరెక్ట్‌గా వాడారు. దీంతో ముంబైలో కూడా శివసేన కార్యకర్తలు నిరసనలు చేపట్టి, కమెడియన్ కునాల్ కామ్రా చిత్రాలను తగలబెట్టారు. ఉపముఖ్యమంత్రిని టార్గెట్‌గా చేసుకొని పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడంతో కునాల్ కామ్రాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.