Manipur: మణిపూర్‌‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్‌ పై దాడి

మణిపూర్‌‌లోని కుకీలు ఎక్కువగా ఉండే కాంగ్‌ పోక్‌పిలో ఆందోళనకారులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఎస్పీ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

author-image
By Manogna alamuru
New Update
manipur

Manipur

మణిపూర్‌‌లో మళ్ళీ హింస చెలరేగింది. కుకీలు ఆందోళనలతో రెచ్చిపోతున్నారు. గత కంత కాలంగా స్తబ్ధుగా ఉన్న వారు ఇప్పుడు కొత్త ఏడాదిలో మళ్ళీ తమ ప్రతాపం చూపిస్తున్నారు. తమ ప్రాబల్య ప్రాంతమైన కాంగ్‌పోక్‌పిలో ఈరోజు కుకీలు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్పీ కార్యాలయం మీద దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. దీంతో ఎస్పీతో సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ దాడికి పోలీసులు రియాక్ట్ అయ్యేలోపు కుకీలు చేయాల్సిన విధ్వంసం అంతా చేసేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుకీలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. 

Also Read: కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

బంకర్ల కూల్చివేతతో మొదలు..

ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో అక్రమ బంకర్లు చాలా ఉన్నాయి. వీటిని తొలిగించేందుకు అక్కడ భద్రతా దళాలు రీసెంట్‌గా ఆపరేషన్ చేట్టాయి. అయితే ఇది అక్కడ గ్రామస్థులకు ఇష్టం లేదు. దాంతో వారు దీనిని అడ్డుకున్నారు. ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే వారిని వెనక్కి పంపించాలనే డిమాండ్‌ మొదలైంది.

Also read: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం

ఇంత జరుగుతుంటే మణిపూర్ పోలీసులు, అధికారులు ఏమీ చెయ్యలేకపోయారని కుకీలు ఆగ్రం వ్యక్తం చేశారు. ఈరోజు దీనికి నిరసనగా ముందు భారీ ఆందోళన చేశారు. దీనిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో కోపోద్రిక్తులైన కుకీలు ఎస్పీ కార్యాలయం మీద దాడి చేశారు. రాళ్ళు, ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ ప్రభాకర్‌ సహా అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 

Also Read: కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

Also Read: మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచకండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment