/rtv/media/media_files/2025/03/22/MYHkLkL1hTQXCr5YOUzl.jpg)
KSRTC Bus Runs Over Woman In Tumakuru Kills On Spot
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ప్రజల్లో ఆందోళనలో పడేసింది. ఎంత తిన్నగా వెళ్లినా.. మృత్యువు కాటేస్తుంది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కర్ణాటకలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నడిచి వెళ్తున్న ఓ మహిళను ఢీ కొట్టింది. అనంతరం ఆమెపై నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
మహిళపై నుంచి వెళ్లిన బస్సు
కర్ణాటకలోని తుమకూరు టౌన్ హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదూర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు రోడ్డుపై నడుస్తున్న మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
అయితే మృతురాలిని మంజమ్మగా గుర్తించారు. మంజమ్మను ఢీకొట్టిన తర్వాత బస్సు డ్రైవర్ సతీష్ వెంటనే బస్సును ఆపలేదు. కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్య చర్య వల్ల ఒక అమాయకురాలు ప్రాణం పోవడంతో స్థానికులకు శోకసంద్రంలో ముంచెత్తాయి. ఇందులో భాగంగా ఇలాంటి విషాదాలను నివారించడానికి అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
(bus-accident | latest accident | latest-telugu-news | telugu-news | viral-video)