కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, సానా సతీశ్ బాబు

అస్సాంలోని గువాహటి సమీపంలో ఉన్న శ్రీ కామాఖ్య దేవి అమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు.

New Update
sana satish babu and Kinjarapu Ram Mohan Naidu

sana satish babu and Kinjarapu Ram Mohan Naidu

అస్సాంలోని గువాహటి సమీపంలో ఉన్న శ్రీ కామాఖ్య దేవి అమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈయనతో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా ఉన్నారు. ఆలయానికి చేరుకున్న వీళ్లిద్దరికీ ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Also Read: నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం అనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత గురించి ఆలయ అర్చకులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు.. భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించారు.

Also Read: బండి భగీరథ్‌ పోక్సో కేసు... బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్

Advertisment
తాజా కథనాలు