Women Reservation Act : నేడు కేంద్ర కేబినెట్‌కీలక భేటీ.. చట్టసభల్లో మహిళలకు 33% కోటాపై నిర్ణయం?

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు అనేక ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

New Update
FotoJet (36)

Women’s Reservation

Women Reservation Act : పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు అనేక ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్న సంకల్పంతో మోడీ  సర్కార్‌ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు జరిగే క్యాబినెట్‌ సమావేశంలో మహిలా బిల్లుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కు పెంచాలని యోచిస్తున్న కేంద్ర సర్కార్‌ అందులో 273 స్థానాలు మహిళలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్‌ భేటీలో ఆమోదం..తెలిపి ఆపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది.

లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కేటాయించేందుకు 29 సెప్టెంబర్‌ 2023 న నారీ శక్తి వందన్‌ అధినియమ్‌.. చారిత్రక బిల్లు ఆమోదం పొందింది. అంతేకాదు పార్లమెంట్‌ కొత్త భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు కూడా ఇదే. అయితే దాని అమలు మాత్రం జరగలేదు. దీనికి కారణం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరగక పోవడం, తాజాగా  2011 జనాభా లెక్కల ఆధారంగా 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయలని మోడీ సర్కార్ పట్టుదలతో ఉంది. అయితే నియోజక వర్గాల పునర్విభజన అంశం తేలకుండా మహిళా రిజర్వేషన్లు అముల చేయాలంటే రాజ్యంగ సవరణ చేయాలి. అందుకే ఈ సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టి 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది.
 
128 వ రాజ్యాంగ సవరణతో నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్‌సభలో మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఈ బిల్లుకు మద్దతు పలికారు. ఇక రాజ్యసభలో అయితే భారీ మద్దతు లభించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో  జనగణన,నియోకవర్గాల పునర్విభిజన లేకుండా మహిళ రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలంటే  ఆ చట్టంలోని సెక్షన్ 5ను సవరించాల్సి ఉంటుంది. సవరించాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం ఉభయ సభలలో మూడింట రెండు వంతుల ఆమోదం అవసరం. దీనికోసం విపక్షాల మద్దతు కూడా అసవరం. కనుక ఏకాభిప్రాయంతో బిల్లును ప్రవేశ పెట్టే దిశగా మోడీ సర్కార్‌ అడుగుల వేస్తోంది.
 
రిజర్వేషన్‌ అమలైతే

 చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం అంతా కష్టమేమికాదు. అది అమలైతే దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల్లో మహిళలకు అమలువుతున్న కోటా కారణంగా చాలామంది మహిళలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. కానీ, అసెంబ్లీ, పార్లమెంట్‌లో మాత్రం అవకాశం రావడం లేదు.  ప్రస్తుతం లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలున్నారు. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 534 కాగా మహిళలకు ఉన్న శాతాన్ని చూస్తే అది కేవలం  13.8 శాతం మాత్రమే. 33 శాతం రిజర్వేషన్‌ అమలులోకి వస్తే.. ఇప్పుడున్న సీట్ల పరంగా చూస్తే లోక్‌సభలో మహిళల సంఖ్య180కి చేరుకునే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభలో సీట్ల సంఖ్య 816 కు పెంచాలని కేంద్ర భావిస్తోంది. అది జరిగితే లోక్‌సభలో మహిళల కోటా ఏకంగా 273కి చేరుకుంటుంది.  మహిళా కోటా అమలైతే.. అన్ని పార్టీలు ఎక్కువ సంఖ్యలో మహిళలకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. తద్వారా చట్టసభలతో పాటు పార్టీల్లోనూ మహిళల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు