/rtv/media/media_files/2026/03/26/key-rules-changing-from-april-1st-2026-03-26-15-10-27.jpg)
Key rules changing from April 1st
మార్చి నెల ముగియనుంది. మరో అయిదు రోజుల్లో ఏప్రిల్‌లోకి అడుగుపెట్టనున్నాం. ఈ నెలలో ఈసారి పలు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి ప్రతి ఒక్క కుటుంబంపై ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. పాన్ కార్డుకి సంబంధించిన రూల్స్ మారనున్నాయి.
వంటగ్యాస్, ఇంధన ధరల్లో మార్పులు
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతన్న సంగతి తెలిసిందే. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. వీటితో పాటు విమాన ఇంధనం (ATF), సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) ధరల్లో మార్పులు రానున్నాయి. దీనివల్ల రవాణా, నిత్యావసరాల ధరలపై ప్రభావం పడనున్నాయి.
కొత్త ఆదాయపు పన్ను చట్టం
ఏప్రిల్ 1 నుంచి పాత 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. దీనివల్ల పన్ను చెల్లింపు ప్రక్రియ మరితం సులభతరం కానుంది. ఉద్యోగులకు ఇచ్చే ఫారం 16 కూడా అందుబాటులో ఉండదు. కానీ దీని స్థానంలో కొత్త ఫారంను తీసుకురానున్నారు. అద్దె, ఇతర ఆదాయాలకు ఇచ్చే ఫారం 16A పేరును కూడా ఫారం 131గా మార్చనున్నారు.
బ్యాంకింగ్, ATM రూల్స్‌లో మార్పు
HDFC, PNB, బంధన్ బ్యాంకులు ATM లావాదేవీలపై కొత్త రూల్స్‌ను తీసుకొస్తున్నాయి. HDFC బ్యాంక్ ఇకనుంచి UPI ద్వారా చేసే ఉచిత ATM విత్‌డ్రాయల్స్‌ను కూడా లెక్కిస్తుంది. ఒకవేళ పరిమితి దాటితే రూ.23 ఛార్జీ విధించనున్నారు. PNB తన డెబిట్ కార్డుల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని తగ్గించింది. కస్టమర్లు ఇప్పుడు తమ కార్డ్ కేటగిరీని బట్టి రోజుకు రూ.50 వేల నుంచి రూ.75 వేల దాకా విత్‌డ్రా చేసుకోగలరు. ఇక బంధన్ బ్యాంక్ ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం వల్ల ATM లావాదేవీ ఫెయిల్ అయితే రూ. 25 ఫైన్ పడనుంది.
పాన్ కార్డ్, రైల్వే రీఫండ్
పాన్ కార్డ్ పొందేందుకు లేదా అప్‌డేట్ చేసేందుకు ఇక నుంచి ఆధార్ కార్డు ఒక్కటే ఉంటే సరిపోదు. ఇతర అదనపు పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైల్వే టిక్కెట్ల రద్దు రూల్స్ కఠినతరం చేయనున్నారు. రైలు స్టార్ట్ అవ్వడానికి 8 గంటల ముందు టిక్కెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. గతంలో ఉన్న 4 గంటల పరిమితిని ఇప్పుడు ఏకంగా 8 గంటలకు పెంచేశారు. దీంతో ఇది ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారనుంది.
Follow Us