Kerala Elections: కేరళ ఓటర్లు ఏటు వైపు ?.. కూటముల వ్యూహాలు ఫలించేనా..

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది.

New Update
Kerala Political Landscape Strengths and Weaknesses of Key Coalitions

Kerala Political Landscape Strengths and Weaknesses of Key Coalitions

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 140 స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికలకు 74.2 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది. ఈసారి రాష్ట్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో కూటమిలకు కలిసొచ్చే అంశాలు, ప్రతికూలంగా ఉన్న అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) బలాలు: 

CPI(M), CPI, కేరళ కాంగ్రెస్ (M), NCP, మరియు ఇతర చిన్న పార్టీలు
1. CPI(M) పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ఠమైన కేడర్ వ్యవస్థ ఉంది. 
2. LDF హయాంలో కేరళ ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, కరోనా లాంటి విపత్తుల సమయంలో ఆరోగ్య వ్యవస్థ మెరుగైన ప్రభావం చూపించడం.
3. ఉచిత ఇంటర్నెట్, జాతీయ రహదారుల విస్తరణ, పాఠశాలల ఆధునీకరణ లాంటి అభివృద్ధి పనులు.
4. పింఛన్లు సక్రమంగా అందించడం, 'రేషన్ కిట్' వంటి పథకాలు పేద వర్గాల్లో మంచి పేరు తెచ్చాయి.
5. మైనారిటీ వర్గాలైన ముస్లింలు, క్రైస్తవుల సపోర్ట్ 
6.  ప్రభుత్వ పథకాలను యువతకు చేరవేయడంలో LDF సోషల్ మీడియా విభాగం చాలా ముందుంటుంది.
7. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో మెజారిటీ స్థానాల్లో LDF గెలవడం వల్ల క్షేత్రస్థాయిలో పట్టు ఉండటం.
8. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో LDF స్పందించిన తీరు ప్రజల నుంచి ప్రశంసలు పొందింది. 
9. 2016 , 2021లో వరుసగా గెలిచి చరిత్ర సృష్టించడం వల్ల కార్యకర్తలలో ఉన్న ఉత్సాహం.
10. 'కెప్టెన్'గా పేరుపొందిన పినరయి విజయన్ దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆయనకున్న ప్రజాకర్షణ.

 బలహీనతలు:

1. వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటం వల్ల సహజంగా ప్రజల్లో కొంత అసంతృప్తి ఏర్పడటం.
2.  లైఫ్ మిషన్ స్కామ్, బంగారం స్మగ్లింగ్ కేసు లాంటి వివాదాలు విపక్షాలకు ఆయుధాలుగా మారడం.
3. రాష్ట్ర అప్పులు పెరిగిపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులో జరుగుతున్న జాప్యం
4. యువతకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల వారు విదేశాలకు వలస వెళ్లడం.
5. అన్ని అధికారాలు సీఎం కార్యాలయం (CMO) చుట్టూనే తిరుగుతున్నాయనే విమర్శలు.
6. కొన్ని ప్రాంతాల్లో CPI(M) కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు.
7. పార్టీలో పాత తరం నేతలు తప్పుకోవడం, కొత్త తరం నాయకులు పినరయి విజయన్ స్థాయి ఇమేజ్ సాధించలేకపోవడం
8.  కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణ వల్ల నిధుల రాక తగ్గుతోందనే భావన ప్రజల్లో కలగడం.
9. ఈసారి కొంతమేరకు మైనారిటీ ఓట్లు  కాంగ్రెస్ (UDF) వైపు మళ్లే అవకాశం ఉండటం.
10. సిల్వర్ లైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో ప్రభావిత కుటుంబాల నుండి తీవ్ర నిరసనలు రావడం 

యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) బలాలు:

కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), ఇతర పార్టీలు 
1. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మధ్యతరగతి ప్రజలు సంప్రదాయబద్ధంగా UDF వైపు చూపే అవకాశం
2. ముస్లిం, క్రైస్తవ వర్గాల నుంచి గట్టి ఓటు బ్యాంక్
3. విపక్ష నేత రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం ఈ కూటమికి ప్లస్.
4. LDF హయాంలో జరిగిన లైఫ్ మిషన్ స్కామ్, గోల్డ్ స్మగ్లింగ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం
5. LDF కూటమి పదేళ్లు అధికారంలో ఉండటం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడం 
6. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 20 ఎంపీ సీట్లున్న కేరళలో UDF కూటమి 18 స్థానాల్లో గెలవడం ప్లస్ పాయింట్ 
7. గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీలలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్, ముస్లిం లీగ్ మద్దతుదారులుగా ఉండటం

బలహీనతలు:

1.కాంగ్రెస్ పార్టీలో ఉన్న 'A' గ్రూప్, 'I' గ్రూప్ మధ్య అంతర్గత పోరు 
2. బూత్ స్థాయిలో పటిష్టమైన కార్యకర్తల నెట్‌వర్క్‌ తక్కువగా ఉండటం.
3. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో సరైన స్పష్టత లేకపోవడం
4.కూటమిలో కాంగ్రెస్ కన్నా ముస్లిం లీగ్ మాట చెల్లుబాటు అవుతోందనే ప్రచారాన్ని BJP, LDF ప్రజల్లోకి తీసుకెళ్లడం
5.గతంలో సపోర్ట్ ఇచ్చిన క్రైస్తవ ఓటర్లు ఇప్పుడు LDF లేదా బీజేపీ వైపు మళ్లడం
6. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో వ్యతిరేక ఓట్లు చీలి LDF లాభపడే అవకాశం
7. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లలేకపోవడం

NDA కూటమి బలాలు: 

1. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ పట్ల ఉన్న క్రేజ్ పట్టణ ఓటర్లలో, యువతలో బలంగా ఉండటం
2. శబరిమల లాంటి అంశాలతో సంప్రదాయ హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం
3. ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడం.
4. కేరళలో RSS కు దేశంలోనే అత్యధిక శాఖలు ఉండటం. ఇది ఎన్నికల సమయంలో పటిష్టమైన గ్రౌండ్ వర్క్‌కు ప్లస్ పాయింట్ 
5. రాష్ట్రంలోని LDF, UDF కూటములపై ఉన్న అవినీతి ఆరోపణలను ఎండగడ్డటం 
6. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, నేషనల్ హైవేల అభివృద్ధి లాంటి కేంద్ర ప్రభుత్వ పనులను తమ విజయాలుగా చూపించడం.
7. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానంలో గెలవడంతో  "బిజెపి కేరళలో గెలవలేదు" అనే అపవాదు తొలిగిపోవడం

బలహీనతలు: 1.కేరళ ఓటర్లు దశాబ్దాలుగా LDF లేదా UDF లకే ఓటు వేయడం వల్ల, మూడవ పార్టీకి ఓటేస్తే వృథా అని భావించడం
2. ముస్లిం, క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న కేరళలో, బీజేపీ హిందుత్వ అజెండా పట్ల ఆ వర్గాల్లో ఉన్న అభద్రతా భావం ఉండటం
3. జాతీయ నాయకత్వం బలంగా ఉన్నా, రాష్ట్రంలో పినరయి విజయన్ లాంటి బలమైన నేత NDAలో లేకపోవడం.
4. రాష్ట్ర బీజేపీలోని వివిధ వర్గాల మధ్య సమన్వయ లోపం ఉండటం.
5. కేరళ ప్రజలు సెక్యులర్ ధోరణిని ఇష్టపడుతారు. బీజేపీ రాజకీయాలు మత ప్రాతిపదికన ఉంటాయనే ముద్ర పడటం పెద్ద మైనస్.
6. బీఫ్ నిషేధం లాంటి అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత
7. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కేడర్ బలం తక్కువగా ఉండటం

Advertisment
తాజా కథనాలు