Kerala Girl Missing: 14 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఆ అడవుల్లో ఏం జరుగుతోంది?

కర్ణాటకలోని అటవీ ప్రాంతాలు, కొండల్లో ట్రెక్కింగ్‌ వెళ్తున్న వారు వరుసగా అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగు రోజుల పాటు అడవిలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది.

New Update
kerala girl

Kerala Girl Missing: కర్ణాటకలోని(Karnataka) అటవీ ప్రాంతాలు, కొండల్లో ట్రెక్కింగ్‌ వెళ్తున్న వారు వరుసగా అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగు రోజుల పాటు అడవిలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడగా, అంతలోనే మరో 14 ఏళ్ల బాలిక ఆచూకీ లేకుండా పోయింది.  

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన శ్రీనంద అనే పదో తరగతి విద్యార్థిని, తన 40 మంది బంధువులతో కలిసి ఏప్రిల్ 7వ తేదీన ఈ కొండ ప్రాంతానికి హైకింగ్‌కు వెళ్లింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో చీకటి పడుతున్న వేళ ఆ బాలిక కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఏప్రిల్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఘాట్ రోడ్లు, లోతైన లోయల్లో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలు, తాళ్ల సాయంతో క్లిష్టమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కేరళ పోలీసులు కూడా ఈ గాలింపులో పాల్గొంటున్నప్పటికీ, ఇప్పటి వరకు బాలిక ఆచూకీ లభించలేదు.

Also Read: అమెరికా vs ఇరాన్ .. యుద్ధం డిమాండ్స్ ఏంటి?

శరణ్య అనే ఐటీ ఉద్యోగిని కూడా

కొన్ని రోజుల క్రితం కేరళకే చెందిన శరణ్య అనే ఐటీ ఉద్యోగిని కూడా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న తడియండమోల్ శిఖరం వద్ద తప్పిపోయింది. ఆమె తన బృందం నుండి విడిపోయి దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. ఆహారం లేకుండా కేవలం నీళ్లు తాగుతూ నాలుగు రోజుల పాటు అడవిలోనే గడిపిన శరణ్యను ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ కాపాడారు. అయితే ఈ ఘటనపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కావాలనే నాటకం ఆడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు.

Also Read: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి సైబర్ టోకరా: లక్ష రూపాయలు మాయం

వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. పర్వతారోహణ చేసే వారి రక్షణ కోసం కొత్త నిబంధనలను తీసుకురావాలని నిర్ణయించింది. పులుల సంరక్షణ కేంద్రాల్లో వాడే ఈ-పెట్రోల్ యాప్ తరహాలోనే, ట్రెక్కర్ల కోసం ఒక ప్రత్యేక ట్రాకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ యాప్ ద్వారా ఎవరైనా తప్పిపోతే వారి మొబైల్ సిగ్నల్ ఆధారంగా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు గైడ్‌లకు వైర్‌లెస్ సెట్లు ఇవ్వడం, గ్రూపు లీడర్లకు బాధ్యతను పెంచడం, ట్రెక్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వంటి కఠినమైన నియమాలను ప్రభుత్వం అమలు చేయబోతోంది.

Advertisment
తాజా కథనాలు