Jyotiraditya Scindia : జేబులో ఉల్లిపాయ ఉంటే ఎండ దెబ్బ ఖతం..కేంద్ర మంత్రి చెప్పినదాంట్లో నిజమెంత?

దేశంలో ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 

New Update
summer heat

దేశంలో ఎండలు(summer) మండిపోతున్న వేళ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ(onion) పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 

రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీలకు చేరిన తరుణంలో సింధియా(jyotiraditya-scindia) తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. మే, జూన్ నెలల్లో చంబల్ ప్రాంతంలో 51 డిగ్రీల ఎండలు ఉన్నా తాను తట్టుకోగలనని, అది తన చంబల్ చర్మం ప్రత్యేకత అని ఆయన చెప్పుకొచ్చారు. తాను కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ వాడనని, ఏసీ గదుల్లో కూడా కూర్చోనని ఆయన అనడం విశేషం.

చూడటానికి నేను కొంచెం యంగ్‌గా కనిపించవచ్చు కానీ, నా ఆలోచనలు మాత్రం పాతవే. జేబులో ఒక ఉల్లిపాయ ఉంచుకుంటే మీకు ఏమీ కాదు. ఆయుర్వేదం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇలాంటి పాత పద్ధతులను మనం మర్చిపోకూడదని ఆయన సూచించారు. కమ్యూనికేషన్ల మంత్రి ఉల్లిపాయలు మోస్తున్నారా అని కొందరు అనుకోవచ్చు కానీ, ఎండ నుంచి రక్షణకు ఇది పాతకాలం నాటి చిట్కా అని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు దేశ రాజధాని ప్రాంతం సహా పలు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రాజస్థాన్‌లోని బామర్ జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం వేళ వీచే వేడి గాలుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, శరీరం డీహైడ్రేషన్ కాకుండా తగినన్ని నీళ్లు తాగాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read :  డ్యూటీలో ఉంటే బొట్టు పెట్టుకోవద్దు.. పోలీసులకు DGP వార్నింగ్!

నిజం ఏంత? 

జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే ఎండ దెబ్బ తగలదు అనే చిట్కా దశాబ్దాలుగా మన దేశంలో ఒక నమ్మకంగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి సింధియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే, దీనిపై ఆరోగ్య నిపుణులు,  సైన్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల ఎండ దెబ్బ తగలదు అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఉల్లిపాయ గాలిలో ఉన్న వేడిని పీల్చుకుంటుందనో లేదా మన శరీరాన్ని చల్లబరుస్తుందనో చెప్పేందుకు ఎలాంటి మెడికల్ ప్రూఫ్స్ లేవు.

ఆయుర్వేదం ప్రకారం ఉల్లిపాయకు చలువ చేసే గుణం ఉన్న మాట నిజమే. కానీ అది తినడం వల్ల లేదా ఉల్లి రసాన్ని అరికాళ్లకు, ఛాతీకి రాసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతే తప్ప, జేబులో పెట్టుకుంటే ఫలితం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉల్లిపాయను సలాడ్ రూపంలో తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.

Also Read :  నాసిక్ TCS మతమార్పిడి కేసులో బిగ్‌ ట్విస్ట్.. సిట్‌ విచారణలో విదేశీ లింకులు బట్టబయలు

Advertisment
తాజా కథనాలు