Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు.. DK శివకుమార్తో ఖర్గే  సీక్రెట్ మీటింగ్!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో అత్యంత రహస్య చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

New Update
karnataka

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో అత్యంత రహస్య చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు  ఈ వార్త కన్నడ రాజకీయాన్నే కాక దేశీయ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.ఇటీవల కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి హాజరై, తిరుగు ప్రయాణంలో ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే ఫ్లైట్‌లో బెంగళూరు చేరుకోవడం, ఆ వెంటనే ఒకేచోట భేటీ కావడంతో ఈ ప్రచారం మరింత  ఊపందుకుంది.

బెంగళూరులో ల్యాండ్ అయిన వెంటనే కర్ణాటక మంత్రి కేజే జార్జ్ నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు అనధికారికంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు కేహెచ్ మునియప్ప, సీఫ్ విప్ అశోక్ పట్టన్, సీఎం న్యాయ సలహాదారు పొన్నన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే డీకే శివకుమార్ తిరుపతికి పయనమవ్వడం గమనార్హం.

2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రస్తుతం ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడువు దగ్గరపడుతుండటంతో, హైకమాండ్ సీఎం మార్పుణపై కసరత్తు మొదలుపెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అకస్మాత్తుగా పరమేశ్వర పేరు

మరోవైపు ఈ పొలిటికల్ హైడ్రామాలో హోంమంత్రి జి. పరమేశ్వర పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం సరికొత్త ట్విస్ట్‌గా మారింది. ఒకవేళ అధిష్టానం సిద్ధరామయ్యను మార్చాలని భావిస్తే.. అందరికీ ఆమోదయోగ్యమైన దళిత నేతగా పరమేశ్వరను సీట్లోకి తీసుకురావచ్చనే ప్రచారం సాగుతోంది.

బయటకు నాయకత్వ మార్పు లేదని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నప్పటికీ.. డీకే శివకుమార్ వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో నెక్స్ట్ సీఎం డీకే అంటూ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. తామిద్దరం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, ఖర్గే జరిపిన ఈ 45 నిమిషాల భేటీ.. కర్ణాటక కాంగ్రెస్‌లో త్వరలోనే ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుందనే సంకేతాలను బలంగా పంపింది.

Advertisment
తాజా కథనాలు