Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 పల్టీలు కొట్టిన కారు! వీడియో వైరల్

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

New Update
ACCIDENT

ACCIDENT

Accident:  కర్ణాటక చిత్రదుర్గ జిల్లా బొమ్మక్కనహళ్లి మజీద్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి యాదగిరి వైపుగా వెళ్తున్న కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి.. 15 సార్లు పల్టీలు కొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

 15 పల్టీలు

పోలీసుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మౌలా అబ్దుల్ (35), అతని ఇద్దరు కుమారులు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తేలింది.

telugu-news | latest-news | road-accident

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment