/rtv/media/media_files/2025/03/16/jdI2FPJ1Tvh5UhF5580t.jpg)
బీజేపీ నేత, సబ్-ఇన్స్పెక్టర్ ల మధ్య గొడవ మాటలతో మొదలై చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిదంటే శుక్రవారం రాత్రి కొంతమంది రోడ్డుపై గుమ్మిగూడటంతో వారిని వెళ్లిపోవాల్సిందిగా సబ్ ఇన్‌స్పెక్టర్ గాడిలింగ గౌడర్ ఆదేశించారు. అయితే పోలీసులపై మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడ దుర్భాషలాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన సబ్ ఇన్‌స్పెక్టర్ కోపంలో హనుమంత గౌడ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో వెంటనే అతను కూడా సబ్ ఇన్‌స్పెక్టర్ ను చెంప దెబ్బకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఇద్దరు మరింతగా కొట్టుకునేందుకు వెళ్లగా పక్కనే ఉన్నవారు వారిని అడ్డుకున్నారు.
ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನಂತರ ನಿರಂತರ ಕೊಲೆ, ಸುಲಿಗೆ, ದರೋಡೆ, ಅತ್ಯಾಚಾರ ಪ್ರಕರಣಗಳು ನಿರಂತರ ಘಟಿಸುತ್ತಿವೆ. ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ಸುರಕ್ಷತೆ ಒದಗಿಸಲಾಗದ ಸ್ಥಿತಿ ನಿರ್ಮಾಣವಾಗಿದ್ದು ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಸಂಪೂರ್ಣ ನೆಲಕಚ್ಚಿದೆ, ಇದರ ನಡುವೆ ಕೆಲವು ಕೆಳಹಂತದ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಸಾಮಾನ್ಯರು ಹಾಗೂ ಜವಾಬ್ದಾರಿಯುತ ನಾಗರಿಕರ… pic.twitter.com/zf5ZN3pk3J
— Vijayendra Yediyurappa (@BYVijayendra) March 15, 2025
కాంగ్రెస్ పై విమర్శలు
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అధికార కాంగ్రెస్‌ను విమర్శించారు. "రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హత్య, దోపిడీ, అత్యాచార కేసులు నిరంతరం జరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు భద్రత కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలీసుల దౌర్జన్యం అని ఆరోపిస్తూ, ఎస్ఐని వెంటనే సస్పెన్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే దీనిపై తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా ఈ గొడవపై ఇరువైపుల నుంచి పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.